వరుస వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన అర్హులైన గిరిజనులకు ప్రభుత్వసాయం అందించడంలో, ఆదుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విపలమైందని సీపీఐ జిల్లా నాయకులు ఆంబాక్కం చిన్నిరాజ్ ద్వజమెత్తారు.
మండలంలో అర్హులైన గిరిజన వరద బాధితులకు రూ.2వేలు చొప్పున ఆర్థికసాయం, 25కిలోల బియ్యం పంపిణీ చేయాలని కోరుతూ వరదయ్యపాలెం మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం సీపీఐ, aisf ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా చిన్నిరాజ్ మాట్లాడుతూ ప్రతి వరద బాధితకుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినా.. అధికారులు మొక్కుబడిగా అరకొర లబ్ధిదారులను గుర్తించి అర్హులకు అన్యాయం చేశారని అన్నారు.
ఓటీఎస్ పేరుతో పేదల నుంచి అసమర్థ జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, తాము నివాసం ఉండే ఇంటికి ప్రభుత్వం పత్రాలు ఇవ్వడమెంటని ఆయన ఎద్దేవా చేశారు.
పాలన చేతగాక అప్పులతో ఏపీని దివాలా తీసిన సీఎం జగన్ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గిరిజన బాధితులకు సహాయం చేసి ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ ఐ.సుబ్రమణ్యం కి వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో cpi నాయకులు కృష్ణమూర్తి, ఏ ఐ ఫ్ అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు మురళి, చంద్ర పాల్గొన్నారు.
.