వరద భాదితుల గుర్తింపు విషయంలో రెవిన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యహరించిందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్న సిబ్బంది పేదలకు అన్యాయం చేసిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సత్యవేడు యంపిడివో కార్యాలయంలో వరద నష్టాల విషయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవిన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులుపై కూడా ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లో వందలాది మందికి న్యాయం జరిగిందనీ అయితే సత్యవేడులో దారుణమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈకారణంగా పేదలకు అన్యాయం జరిగిందన్నారు.
సత్యవేడు మండలంలో పెద్ద పెద్ద బడాబాబులు భూ ఆక్రమణలతో పబ్బం గడుపుకుంటున్నారనీ వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. తనమంచి తనాన్ని కొందరు అలుసుగా తీసుకోవడం బావ్యం కాదన్నారు.
తాను క్షేత్రస్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని ఎవరు ఏరకంగా పనిచేస్తున్నారన్న విషయం తనకు భాగా తెలుసునని పేదలకు అన్యాయం జరిగితే ఎవరినీ వదిలిపెట్టే ప్రశక్తే లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు.
కొందరు ప్రజా ప్రతినిధులు అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కనబెట్టి తమ ఆదిపత్యం కోసం పాకులాడటం మంచిది కాదని హెచ్చరించారు. వరదభాదితులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈకార్యక్రమంలో యంపిపి ప్రతిమ,జడ్పీటీసి విజయలక్ష్మీ, యంపిడివో సురేంద్రనాథ్,యంఆర్ఓ శ్రీదేవి,క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గోన్నారు.
.