రేషన్ బియ్యం అక్రమరవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో నారాయణవనం నుండి తమిళనాడుకు రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
ఈ సమాచారం మేరకు నందనం వద్ద నాగలాపురం ఎస్ ఐ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా రేషన్ బియాన్ని తమిళనాడు తరలిస్తున్నట్లు తెలిపారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన నాగరాజు, సాయి కుమార్ అనే ఇద్ధరిని అదుపులో తీసుకున్నాము, బాలాజీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సత్యవేడు సి ఐ శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి, రాధాకృష్ణ, కానిస్టేబుల్ భరత్, భాగ్య రాజ్,ఎస్ పి ఓ లు ఉమామహేశ్వర్, లోకనాధం, గణేష్ బాబు పాల్గొన్నారు.
.