సబ్సిడీ వేరుశనగ విత్తనాలను జడ్పిటిసి సభ్యులు కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు.
బుధవారం మధ్యాహ్నం నారాయణవనం వ్యవసాయ కార్యాలయానికి సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు చేరుకున్నాయి.
సమాచారం అందుకున్న జడ్పిటిసి సభ్యులు సుమన్ ఏ ఓ కార్యాలయానికి చేరుకొని విత్తన కాయలను కిందకు దించి పరిశీలించారు.
ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో సబ్సిడీ వేరుశెనగ విత్తనాల కాయలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతులమీదుగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతి లోడ్డును పరిశీలించి నాణ్యత ఉన్న విత్తనాలను మాత్రమే పంపిణీ చేస్తామన్నారు. నాసిరకం విత్తనాలను వెనక్కి పంపిస్తామని సుమన్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్, డీసీసీ బీ డైరెక్టర్ ఊరప్ప, కో ఆప్షన్ సభ్యులు మణి రెడ్డి, , నాయకులు అయ్యప్ప, ఆర్ బి కే సిబ్బంది సుభాషిని, రమ్య పాల్గొన్నారు.
.