మాతృభాషను పరిరక్షించుకోవాలని మిమిక్రీ కళాకారుడు, కవి కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు.
తొట్టంబేడు మండలం పెన్నలపాడు ప్రాథమిక పాఠశాలలో సోమవారం బాలరంజని సాహితీ కళాసంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మన భాషను పరిరక్షించుకుంటూ ఇతర భాషలను గౌరవించాలన్నారు.
అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, పద్య, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.విద్యార్థులు తెలుగుతల్లి, తెలుగు కవులు వేషాధారణతో అలరించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు,గేయ పుస్తకాలు అందచేసారు.
ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయుడు దినకర్ పాల్గొన్నారు.
.