ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర కన్వీనరుగా శ్రీకాళహస్తికి చెందిన మాజీ సైనికులు, జైభీమ్ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇటీవల విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పులి శ్రీకాంత్ ను కన్వీనరుగా ఎన్నుకున్నారు.
అదేవిధంగా కే ఎస్ భాస్కర్ ను కో-కన్వీనరుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కుంపటి శ్రీనివాసులు, నూకరాజు, ప్రవీణ్ కుమార్, బాబురావు, కాయం రత్నం, తెలంగాణ అసోసియేషన్ సభ్యులు గుర్రా విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పులి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రాయితీల్లో కోత విధించడం అన్యాయమన్నారు.
ఈ కారణంగా వీరి బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి… రాయితీలు పునరుద్దరించే విధంగా నూతన కమిటీ పని చేస్తుందని ఆయన చెప్పారు.
Discussion about this post