తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ గర్వించగలిగే అద్భుత చిత్రాలను రూపొందించిన తిరుగులేని దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో రెండు వారాల్లో 93వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉన్న విశ్వనాధ్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరి అక్కడే మరణించారు.
గుంటూరు జిల్లా పెదపులిపర్రులో సుబ్రమణ్యం , సరస్వతమ్మ దంపతులకు విశ్వనాధ్ జన్మించారు.
వర్తమాన తెలుగు సినిమా చరిత్రలో దర్శక మేరునగ సమానునడు కె విశ్వనాధ్ గా సినీ ప్రపంచానికి చిరపరిచితుడు అయిన కాశీనాథుని విశ్వనాధ్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురువారం రాత్రి హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
విశ్వనాధ్ 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. 1992లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 2016 లో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది.
కె. విశ్వనాధ్ స్వస్థలం గుంటూరు జిల్లా పెదపులిపర్రు. ఆయన చెన్నైలోని ఓ స్టుడియోలో సౌండ్ రికార్డిస్టుగా గా సినీరంగ ప్రవేశం చేశారు. 1965లో ఆత్మగౌరవం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. దాదాపు యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, స్వాతికిరణం ఇలా చెప్పుకుంటూ పోతే.. తిరుగులేని చిత్రాలు ఆయన ఖాతాలో అనేకం మనకు కనిపిస్తాయి. తన చిత్రాల్లో తెలుగుదనానికి, సాంప్రదాయ కళలకు పెద్దపీట వేస్తూ.. ఉన్నతమైన విలువలుగల జీవన ప్రమాణాలతో సినిమాలు తీయడం ఆయన ముద్రగా తెలుగు ప్రేక్షకులకు పరిచితమే.
Discussion about this post