పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన రిలే నిరాహార దీక్షలో శ్రీకాళహస్తికి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తమ పాత్ర కూడా ఎంతో కీలకం అని పేర్కొన్నారు.
తమ సమస్యలను సాధించుకోవడం కోసం మాత్రమే పోరాటాలు నిర్వహిస్తున్నామని కానీ ప్రభుత్వాలు ఏవైనా విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా తాము పనిచేస్తామని పలువురు పేర్కొన్నారు.
రాష్ట్ర పిఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రిలేదీక్షలు చేపట్టామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు రాఘవులు, ప్రధాన కార్యదర్శి రఘు, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు పి ఎం ఆర్ ప్రభాకర్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు
శ్రీకాళహస్తి ఎన్జీవో తాలూకా అధ్యక్షులు చెంచు రత్నం యాదవ్, పిఆర్సి సాధన సమితి నాయకులు సుబ్బారెడ్డి, శ్రీకాళహస్తి డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి తొట్టంబేడు వీఆర్వోల సంఘ అధ్యక్షులు మురళి నాయుడు, విద్యావతి , విఆర్వోలు నారాయణ, పూర్ణిమ,
తొట్టంబేడు మండల వీఆర్వోల సంఘం మాజీ అధ్యక్షురాలు మాధవి , శ్రీకాళహస్తి ఎన్జీవో నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ,ముని కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, పిఆర్సి సాధన సమితి నాయకులు సుబ్బారెడ్డి ,గంగయ్య, రఫీ, శాంతి దుర్గ, శ్రీనాథ్ పలువురు ఉద్యమ నేతలు పాల్గొన్నారు.
.