శ్రీ కాళహస్తి:స్థానిక ఏ ఎల్ వో ఆఫీస్ దగ్గర AITUC భవన నిర్మాణ కార్మికులుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
2018 నుండి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ రిలీజ్ చేయాలని ఇసుక పాత పద్ధతులను అమలు చేయాలని అన్నారు.
covid 19 ఉపాధి కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్న కార్మికుడికి పదివేల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని విమర్శించారు.
రాయలసీమ జిల్లాలలో వర్షాల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగింది వారిని ప్రభుత్వం ఆదుకోవాలని
రెండు సంవత్సరాలుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లు త్వరగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైయస్ మణి, సిపిఐ పార్టీఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య,మల్లికార్జున్, గోపి, సురేష్, గురవయ్య,జాకీర్, భవన నిర్మాణ కార్మికులు శేషయ్య, బాబు, రాజా, గణేష్ ,తదితరులు పాల్గొన్నారు.
.