“న్యాయస్థానం నుండి దేవస్థానం” వరకు మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
వారికిఆలయ త్రినేత అతిథి గృహం వద్ద ఆలయ మాజీధర్మకర్తలమండలిచైర్మన్ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంఛార్జి ఆనందకుమార కోలా నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి వారికి ఆత్మీయస్వాగతం తెలియజేశారు.
స్వామి – అమ్మవార్ల దర్శనానంతరం ప్రతి ఒక్కరికీ వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, అమరావతి రైతులు చేస్తున్న ఈ మహాపాద యాత్ర ఖచ్చితంగా “జైత్రయాత్రగా” నిలవాలని, స్వామి -అమ్మవార్లను వారు ప్రార్ధించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా పాదయాత్రకు సహకరించి, ఇంతటి మంచి దర్శనము ఏర్పాటు చేసిన కోలా ఆనందకుమార, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి, కుమారస్వామి ఇతర నాయకులకు అమరావతి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
.