ఓమిక్రాన్ వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించవలసినదిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనరు తెలియజేశారు.
జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీని నుంచి భద్రంగా ఉండగలమని తెలియజేస్తూ.. దానికి సంబంధించి వివరాలను శ్రీకాళహస్తి మునిసిపాలిటీ వెల్లడించింది.
1 . ఇది కొత్త కరోనా రకం:-
ఇది మన దేశం లో రెండో వేవ్ { మార్చ్ – మే 2021 } కి కారణం అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా ఈ ఓమిక్రాన్ విస్తరిస్తుంది. డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం అంటే ఓమిక్రాన్ ను నిలువరించడం అసాధ్యం.
2. ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు:-
బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం కనిపిస్తాయి. చికెన్ గున్యా కు దీనికి చాలా వరకు ఒకటే లక్షణాలు ఉంటాయి.
3. ఎవరికి సోకుతుంది:-
A) మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు. వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారి పై దీని ప్రభావము అత్యంత స్వల్పముగా ఉంటుంది.
B) ఇప్పటిదాకా కరోనా సోకకుండా, వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్నవారికి స్వల్ప లక్షణములు అయిన రెండు రోజులు అలసట, పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరం తో ఉంటుంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన సరైన వైద్య సదుపాయము పొందవలెను.
C) ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా, వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది.
4. తీసుకొనవలసిన ఆహార పదార్దములు:-
పన్నీర్ , మొలికెత్తిన పెసలు, పుట్టగొడుగులు, బ్రోకలీ, జామ కాయ, చికెన్, ఫిష్ మటన్, గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు. రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగాలి. చెమట పట్టేదాకా వ్యాయామం (కనీసం నడక) చెయ్యాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. నిద్ర బాగా పోవాలి. ఇవన్నీ ఇమ్మ్యూనిటి ని బలపరుచుకొనే మార్గాలు.
భయాన్ని దూరం పెట్టండి. నిర్భయంగా వుండండి. అప్రమత్తత అవసరం. అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒక సారి చెక్ చేసుకోండి. అది 94 పైగా ఉంటే హ్యాపీగా గా కాలం గడపండి.
కావున, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు విధిగా ధరించి ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఉపయోగించాలి. మీ పరిసరములను పరిశుభ్రముగా ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సూత్రములు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలని కమిషనర్ కోరారు.
ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే దగ్గర్లోని సచివాలయంలో, ఏరియాస్పత్రిలోని వార్డు ఏ.యన్.యం. లేదా మెడికల్ ఆఫీసర్ వారిని సంప్రదించి తగు వైద్య సలహాలను పొందాలని కమిషనర్ సూచించారు.
.