బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లేబర్ ఆఫీసరు రంగనాథ్ అన్నారు.
శ్రీకాళహస్తిలో సోమవారం నిర్వహించిన వీధి బాలల సర్వేలో రంగనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి బాలలకు విద్య, పౌష్టికాహారంతో పాటుగా… సాధారణ పిల్లలకు లభించే అన్ని రకాల వసతులు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
అనంతరం పట్టణంలో గుర్తించిన వీధి బాలలను అందుబాటులో ఉన్న సంరక్షణ కేంద్రాలకు తరలించారు. కాగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం వద్ద తల్లితో పాటు నలుగురు బాలికలను గుర్తించడంతో వారిని ఐసీడీఎస్ వారికి అప్పగించారు.
ఆ తరువాత వారిని ఐసీడీఎస్ వారు తిరుపతిలోని మహిళా ప్రాంగణానికి తరలించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి భువనేశ్వరి, సీ ఆర్ పీ మునిమోహన్, శాంతి, లలిత, ప్రదీప్, ప్రసాద్, ధనశంకరయ్య, స్వప్న, కృష్ణయ్య, గాంధీ, దేవీప్రియ, హేమలత, మంజు, మంజుల తదితరులు పాల్గొన్నారు.
.