చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన వాయులింగేశ్వరస్వామిని శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్ఫాట్లు చేశారు. ధర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా దర్శనానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తంను ప్రయివేటు విద్యా సంస్థ అధినేత మోహన కృష్ణ, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది ప్రశాంత్ తదితరులు శాలువతో సన్మానించారు.
.