శ్రీకాళహస్తికి మకుటాయమానమైన స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్‌ని మూసివెయ్యాలని దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శులు కొట్టే సాయి, జయప్రకాష్ మరియు జనసేన నాయకులు కుమార్, చిరంజీవి, వంశీ ఈరోజు స్కిట్ కళాశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడి సమస్య యొక్క తీవ్రత తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేలమంది విద్యార్థులకు మంచి విద్యను ఇచ్చి,చాలామంది గొప్ప గొప్ప స్థాయిల్లో,మరికొంతమంది విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులను ఇచ్చిన SKIT కాలేజీని పూర్తిగా నిర్వీర్యం చేసి,ఇక భవిష్యత్తులో దీన్ని నడపలేమని, నడిపినా ఉపయోగం లేదని ప్రభుత్వ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి కాలేజీని పూర్తిగా నడిపించేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.
అలాగే జనసేన కార్యదర్శి మరియు స్కిట్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన జయప్రకాష్ మాట్లాడుతూ “శ్రీకాళహస్తి పట్టణానికి ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చిన కళాశాల ఈరోజు మూసివేత దశకు చేరుకోవడం బాధాకరం” అన్నారు.
స్కిట్ కళాశాలలో చదివి దేశవిదేశాలలో ఉన్నతపదవులలో ఉన్న పూర్వ విద్యార్థులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, శ్రీకాళహస్తివాసులను కూడా కళాశాల మూసివేత నిర్ణయం తీవ్రమనోవేధనకు గురిచేస్తోందని తెలిపారు
ఈ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కళాశాలను కాపాడుకోవడానికి పోరాటం ఉధృతం చెయ్యబోతున్నట్లుగా తెలిపారు. స్కిట్ కళాశాల కోసం ఇది వరకే జనసేన పార్టీ తరపున ఆలయ పరిపాలనాధికారికి వినతిపత్రం ఇచ్చిన విషయం కూడా గుర్తు చేసుకున్నారు.
.