జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ఈరోజు శ్రీకాళహస్తిలోని తన కార్యాలయంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ డిమాండ్ తో తొలుత కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసి లేఖ ఇచ్చింది పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు.
ఎంతోమంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని, తెలుగువారికి ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ అని నాడు ఢిల్లీలో వివరించారు.
దీని పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని తెలుగువారి తరఫున తన గళాన్ని బలంగా వినిపించారన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని,ఉక్కు పరిశ్రమపై జగన్ మోహన్ రెడ్డి స్పందించలని అంజూరు చక్రధర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఫయాజ్, రామయ్య, షఫీ, శరత్, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.
.