సీనియర్ పాత్రికేయులు వళ్లు వెంకట్రావు సేవలు మరువలేనివని బీజేపీ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు, కిసాన్ మోర్చా ఇన్ ఛార్జి చంద్రప్ప అన్నారు.
శ్రీకాళహస్తి మండలం గంగలపూడిలో ఆదివారం వెంకట్రావు కర్మక్రియలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి చంద్రప్ప హాజరై వెంకట్రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ వెంకట్రావు పాత్రికేయ వృత్తిలో ఎంతో నిస్వార్థంగా… సమాజ హితం కోరి పని చేశారని కొనియాడారు.
ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణు తదితరులు పాల్గొన్నారు.
.