“న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు” అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర” శ్రీకాళహస్తి పట్టణంలో పూర్తి చేసుకుని తిరుపతికి బయలుదేరిన సందర్భంగా శ్రీకాళహస్తినుంచి ఘనంగా వీడుకోలు పలికారు.
పానగల్ ప్రాంతం నుండి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంఛార్జి ఆనందకుమార కోలా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ – జనసేన పార్టీల కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేశారు.
పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ – జనసేన పార్టీల నాయకులకు, సంఘీభావం తెలియజేస్తున్న ఇతర పార్టీల నాయకులకు స్థానిక మహిళలు స్వచ్ఛందంగా అడుగడుగునా పూల వర్షాన్ని కురిపించారు.
శ్రీకాళహస్తి పట్టణం, పానగల్ నుండి తిరిగి ప్రారంభమైన ఈ యాత్రలో బీజేపీ – జనసేన పార్టీల వారు ఏర్పేడులోరైతులు బస చేయు ప్రాంతం వరకు పాల్గొన్నారు
.