శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు ఈ రోజు తల్లీతండ్రుల కమిటీ సభ్యులు సమావేశం జరిగినది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి, తల్లీతండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్ , తల్లీతండ్రుల కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమయంలో ఆకస్మికంగా భోజనం రుచిని పరిశీలించారు. తర్వాత విద్యార్థులను రోజు పెట్టే భోజన రుచులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం సమావేశంలో తదుపరి కార్యాచరణాలపై చర్చించారు.
తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్ మాట్లాడుతూ… పాఠశాల అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలనీ, అలాగే మన పాఠశాల గ్రౌండ్ ను మనమే సంరక్షించుకోవాలని అన్నారు.
అవకాశం ఉంటే ప్రతిరోజు తల్లీతండ్రుల కమిటీ సభ్యులు ఒకరు మధ్యాహ్న భోజనం సమయంలో హాజరై సమస్యలు లేకుండా పౌష్టికరమైన భోజనం విద్యార్థులకు అందిచాలని కోరారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి మాట్లాడుతూ.. ప్రెవేట్ పాఠశాలకు సమానంగా ప్రభుత్వం ఇపుడు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల అభివృధికి, విద్యార్థుల సంరక్షణకు
తల్లీతండ్రుల కమిటీ సహకరించాలని అన్నారు.
.