శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె పవిత్రరెడ్డి బియ్యపు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడుమండలం కంచనపల్లి గ్రామం అంకన్నగుంట చెరువును పరిశీలించారు.
చెరువు బోగడ పడడంతో వాటిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతుల దిశగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు.
అనంతరం వరదముప్పుతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని తెలియజేశారు.
జగనన్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని.ఈ ప్రభుత్వంలో ఎప్పుడు రైతులకు ఉన్నతస్థానం ఉంటుందని అన్నారు. రైతులకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యాచరణ చేపడతారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.