చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి కవితల పోటీలు, కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె.రామలక్ష్మి హరికృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనం లో పాల్గొన దలచిన కవులు, కవయిత్రులు స్వామి వివేకానంద ,యోగివేమన, నేతాజీ సుభాష్ చంద్రబోస్,
మహాత్మా గాంధీజీ , సంక్రాంతి పర్వదినం అంశాల మీద ఇరవై ఐదు లైన్లు పద్య, వచన ,గేయ కవితలు పంపవచ్చని వారు తెలిపారు .
కవితలు హరికృష్ణా రెడ్డి .దాసరా పల్లి గ్రామం పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా 517126 చిరునామాకు పంపాలని వారు తెలిపారు.
వివరాలకు హరికృష్ణ 9441911161 నంబరును సంప్రదించాలని వారు. తెలిపారు
Discussion about this post