పల్లెల్లో దీర్ఘ కాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జి వినుత కోటా డిమాండు చేశారు.
ఏర్పేడు మండలం కొత్తవీరాపురం అరుంధతి వాడలో శనివారం పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, శ్మశాన వాటికి వంటి సమస్యలతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
ఈ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీంతో వినుత ఏర్పేడు ఎంపీడీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కొత్తవీరాపురం అరుంధతి వాడలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, నాయకులు నితీష్ కుమార్, వినోద్, చందు చౌదరి, తేజ, గిరీష్, జనసైనికులు పాల్గొన్నారు.
.