ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (257) జిల్లా కార్యవర్గంలో శ్రీకాళహస్తికి అగ్రస్థానం వేశారు. ఈ నెల 26న ఈ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.
రాష్ట్ర కౌన్సిలర్లుగా దావాలన జయరాం, మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎం.రమేష్ (కేవీబీపురం), కార్యదర్శులుగా శ్రీహరి, కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం, ఆడిట్ కమిటీ కన్వీనరుగా అక్తర్ అలీఖాన్, ఆడిట్ కమిటీ సభ్యులుగా కె.వెంకటాద్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరి చేత ఎన్నికల అధికారి కె.అశోక్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఏపీటీఎఫ్ సంఘ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తామన్నారు. కాగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.
.