జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ రాష్ర్ట సమాచార కమిషనరు శంకర్ నాయక్, ఆదాయపు పన్నుశాఖ కమిషనరు జీవన్ లాల్ దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్ధిరాజు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశ్వీరచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్, నాగభూషణ్ యాదవ్, హరిబాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.