శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవగర్గం ఇన్ ఛార్జి డాక్టర్ బత్తెయ్య నాయుడు డిమాండు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తిలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బత్తెయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎంతో చారిత్రక నేపథ్యం.. వసతులు ఉన్న శ్రీకాళహస్తిని కాదని నాయుడుపేటను రెవిన్యూ డివిజనుగా చేయాలని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నాయుడుపేటను రెవిన్యూ డివిజనుగా చేయడం వలన శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాల ప్రజలకు ఇబ్బుందులు ఎదురవుతాయని ఆయన చెప్పారు.
శ్రీకాళహస్తి అయితే అందరికీ అనుకూలంగా… ఆమోద యోగ్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చకోక పోతే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జానీ బాషా, బీవీ శేఖర్ర్, వెంకటముని, నాగూరయ్య, శివయ్య, వానమ్మ, బానమ్మ, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.
.