భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలేశుని దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా చిన్న ఆటంకం ఏర్పడింది. తిరుమలకు చేరే రెండు కాలినడక మార్గాల్లో ఒక దానిని అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. శ్రీనివాస మంగాపురం ప్రాంతంనుంచి ఉండే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు. సాధారణంగా ఎక్కువ మంది భక్తులు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం యథాతథంగా ఉంటుంది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ మూసివేయించింది. అసలే భారీ వర్షాలకు తిరుమల మార్గంలోనూ కొండచరియలు అక్కడక్కా విరిగిపడుతున్నాయి. రోడ్డు మార్గంలో కొండచరియలు పడితే.. ఎప్పటికప్పుడు సిబ్బంది తొలగిస్తున్నారు.
అదే తరహాలు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ సమయాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అనే ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. భక్తులను ఎప్పటినుంచి తిరిగి అనుమతిస్తామనే విషయాన్ని తిరిగి తెలియజేస్తామని, నడకదారి భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు తెలియజేశారు.
.