శ్రీ వైష్ణవ క్షేత్రాలలో కలియుగ వైకుంఠమైన తిరుమలకు క్షేత్ర పాలకుడు మాత్రం రుద్రుడు. భక్తులకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. తిరుమలలో కైంకర్యాలు అన్ని కలియుగ వైకుంఠ వాసుడైన శ్రీనివాసునికే చెందుతాయి. అయితే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే రుద్రుని రూపమైన శిలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైష్ణవ క్షేత్రమైన తిరుమలకు క్షేత్రపాలకుడిగా రుద్రుడు ఉండడమే ఇందుకు కారణం.
మోడీ ప్రతిష్టను భంగపరుస్తున్న యూపీ సీఎం యోగి
తిరుమలలోని గోగర్భం సమీపంలో పాండవ తీర్థం వద్ద రుద్రుని రూపంలో క్షేత్రపాలకుడు కొలువై ఉన్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఏడాదిలో ఒక్కసారి మాత్రమే క్షేత్ర పాలకునిగా రుద్రుడు తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు అందుకుంటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా తిరు వేంకటగిరినాధుని భక్తకోటి ఆరాధిస్తుండగా, ఆయన క్షేత్రానికి మాత్రం పాలకుడి రుద్రుడుండడం శివకేశవ అభేదానికి ప్రతీకాత్మకం కావొచ్చు.
తిరుమల పాండవతీర్థంలో క్షేత్రపాలకుడు రుద్రుడికి ఘనంగా అభిషేకం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుమలలోని గోగర్భం తీర్థం వద్దగల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి శుక్రవారం అభిషేకం వైభవంగా జరిగింది. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
Discussion about this post