భారత మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయమని బీజేపీ నేతలు కొనియాడారు. భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతి వేడకులు శ్రీకాళహస్తి పాత బస్టాండ్ సర్కిల్ వద్ద పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
వాజపేయి చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు వాజపేయి తన జీవితాన్ని భారతదేశ అభివృద్ధి కొరకు అంకితం చేశారన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రారంభ దశ నుంచి ఆయన చేసిన కృషి, సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరికీ మంచి విద్య, వైద్యం అందించడానికి మాజీ ప్రధాని ఎంతో కృషి చేశారన్నారన్నారు.
రోడ్ల అభివృద్ధికి, నదుల అనుసంధానం కి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రస్తుతం భారతదేశం లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అభివృద్ధి చెందిందంటే వాజపేయి లాంటి మహానుభావుల త్యాగఫలమేనన్నారు.
ప్రతి కార్యకర్త వీరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యకర్తలు అందరూ క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది భక్తవత్సలం నాయుడు, కృష్ణమూర్తి, రైల్వే భక్తవత్సలం, మహిళా సీనియర్ నాయకురాలు చాగణం శైలజ, కన్నా వెంకటేశ్వర్లు, ఇమ్మడిశెట్టి మోహన్ రావు , కిట్టు, వాసు యాదవ్, గోపాల్, వెంకటేష్ ఆచారి, మహబూబ్ బాషా, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
.