వివేకానందుని జీవితం అందరికీ ఆదర్శమని తెలుగు ఉపాధ్యాయులు బాలయ్య అన్నారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో బుధవారం వివేకానందుని జయంతి వేడుకలు నిర్వహించారు.
శ్రీ కాళహస్తిలో ప్రాంత ఉపాధ్యక్షులు అంజూరి బాలసుబ్రమణ్యం మార్గదర్శనంతో… పట్టణ సామాజిక సమరసతా వేదిక అధ్యక్షులు పసల వీరాస్వామి అధ్యక్షతన ఈ జయంతి వేడుకలు జరిగాయి.
ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గల వివేకానందుని విగ్రహానికి చందన అభిషేకము చేసి పూలమాల వేశారు. అనంతరం అధ్యక్షులు వీరాస్వామి మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద వలె కష్టాలను ఎదుర్కొంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళాలన్నారు.
ఇక ముఖ్య అతిధి బాలయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం మన అందరికీ ఆదర్శప్రాయమని… యువత వ్యసనాలకు బానిసలై చెడు మార్గాలలో వెళ్ళకుండా తల్లిదండ్రులను,గురువులను , పెద్దలను గౌరవిస్తూ సన్మార్గంలో వెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.
ప్రాంత ఉపాధ్యక్షులు అంజూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు అందరూ సమానమేనని… జాతి, కుల భేదాలు లేకుండా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పిళ్ళారి బత్తినయ్య, కార్యదర్శి డి వి వి శ్రీనివాసులు, చిలక రంగయ్య, ఈశ్వరయ్య, రమేష్, మహేష్, సురేష్, సుబ్బరామిరెడ్డి, మంగి రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు, స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
.