శ్రీకాళహస్తి నియోజకవర్గం యానాదుల నూతన జాయింట్ యాక్షన్ కమిటీని సోమవారం ఎన్నుకున్నారు.
శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్ లో గల యానాది సంఘం కార్యాలయం ఆ సంఘం నేతలు సమావేశమై ఈ కమిటీని ఎన్నుకున్నారు.
యానాదుల సంఘం జేఏసీ అధ్యక్షురాలుగా కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలుగా వేదవతి, కార్యదర్శిగా శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా విశ్వనాథ్, కోశాధికారిగా శుభరత్నను ఎన్నుకున్నారు.
యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.
.