శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన శ్రీవళ్లీ, దేవసేన సమేత చెంగల్వరాయస్వామికి శనివారం హైదరాబాదుకు చెందిన అజస్ర హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధినేత ఎన్. రామకృష్ణ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి రూ.18.30లక్షల విలువ చేసే వెండి ఉరువులు బహూకరించారు.
ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఈ వెండి ఉరువులను స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలియచేసి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభిషేక గురుకుల్ రాజేష్ గురుకుల్, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, తనిఖీదారు హరి బాబు యాదవ్, సిబ్బంది దాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post