పైకి చేసేది మాత్రం గుడిలో అర్చకత్వం. కానీ లోన చూసేది మాత్రం రాక్షసత్వం. అమ్మవారి అనుగ్రహం కోరి పూజలు చేయడానికి వస్తే ’అయ్యగారు అనుగ్రహించబోయారట‘. అలాంటి సంఘటన ఒకటి మల్కాజ్ గిరి పరిధిలో చోటుచేసుకుంది.
ప్రస్తుతకాలంలో ప్రజల్లో భక్తి పెరిగిపోతోంది. అమ్మవారి అనుగ్రహం కోసం 17 ఏళ్ల బాలిక ఒక గుడిలో అమ్మవారి దీక్ష తీసుకుని పూజలు చేస్తోంది. అయితే అదే గుడిలో ఉన్న అర్చకుడు ఆమెపై కన్నేశాడు. దీంతో ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి ఆమెచేత కొన్ని మాత్రలు మింగించాడట. పూజారి చెబితే ప్రత్యేక పూజలు చేయించడానికి ఎవరు మాత్రం వెనుకాడతారు. నిజమేనని నమ్మి ఆ బాలిక ఆ మాత్రలను మింగింది. తిరిగి సాయంత్రం వస్తే నగ్నంగా పూజలు చేయాలని ఆమెకు చెప్పి పంపాడట ఆ అర్చకస్వామి. కానీ మాత్రలు వికటించడంతో ఇంటికి వెళ్లిన కాసేపటికి ఆమెకు వాంతులు రావడంతో అసలు విషయం బయటపడింది. అర్చకుల వారు పోలీసుల అదుపులోకి వచ్చారు. అయినా అర్చకులు అయినంత మాత్రాన బుద్ధి శుద్ధంగా ఉండాలి కదా… ఇలాంటి కలుషితమైన బుద్ధితో ఏవిధమైన పూజలు చేస్తారు… ? మనం కూడా కాస్త ఆలోచించాలి. రాత్రి పూట పూజలు అందునా నగ్నంగా పూజలు అంటే కాస్తైనా సందేహించకుండా అంత గుడ్డిగా నమ్మితే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి.
.
Discussion about this post