చిత్తూరు జిల్లాలోని కొందరు టీచర్లు ఒక కొత్తరకం తప్పు చేసి తగిన శిక్ష అనుభవించారు. ప్రభుత్వం నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే చర్యల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఉపాధ్యాయులు అతితెలివి ప్రదర్శించారు! వారి ఎత్తుగడ కాస్త బట్టబయలైంది. దాంతో శిక్ష అనుభవించక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగింది? అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అతితెలివి ప్రదర్శించారు . ఈ ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టేసరికి, తమ స్కూలులో చాలా మంది విద్యార్థులు చదువుతున్నట్టు రికార్డులు తయారు చేశారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు కూడా తప్పుడు నివేదికలు పంపారు. స్కూల్ నుంచి టీచర్ల పంపిన నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేసేసరికి వారి బండారం బట్టబయలు అయింది.
తిరుచానూరు మండల పరిషత్ పాఠశాలలో ఇలాంటి నిర్వాకం చోటుచేసుకుంది. పాఠశాల హెడ్మాస్టర్ శ్యామల ఆమెతో పాటు టీచర్లు నాగరాజు, సునీత, రమేష్ వీరందరినీ కూడా జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు. వీరు ఇలాంటి లోపాయికారి ప్లాన్ వేయడానికి సహకరించిన మరి కొంతమంది టీచర్లు, సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అనే సామెత చెబుతూ పిల్లలకు నీతులు నేర్పించే టీచర్లు తామే సస్పెన్షన్కు గురికావడమే తమాషా!
.
Discussion about this post