అలనాటి అందాల తార ఖుష్బూకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె కారుకు పెద్ద ప్రమాదం జరిగింది. అయినా దేవుడు దయ చూపడంతో ఆమె పెను ప్రమాదం నుండి బయటపడింది.
భాజపా నాయకురాలు ఖుష్బూ బుధవారం నాడు కడలూరు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును,చెంగల్ పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో మేల్ మరువత్తూర్ వద్ద కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన సమయానికి కారులోని ఎయిర్ బెలూన్స్ వెంటనే తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ విషయాన్ని గురించి ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ దేవుడి దయ వల్ల తాము ప్రాణాలతో బయటపడినట్టు తెలిపారు కడలూరులో వేల్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి ఆమె పోలీసులకు తెలుపుతూ ట్యాంకర్ రాంగ్ రూట్ లో వచ్చి, తన కారును వేగంగా ఢీకొన్నట్టు తెలిపారు. తన కారుకు జరిగిన ప్రమాదంపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
.
Discussion about this post