Warning: The magic method Post_Views_Counter::__wakeup() must have public visibility in /home/adarsini/public_html/wp-content/plugins/post-views-counter/post-views-counter.php on line 98
About Us – Adarsini
Sunday, September 14, 2025

About Us

చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు. సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం. ఈ వెబ్‌సైట్లోని విశ్లేషణల ద్వారా ప్రతిపాదించే ప్రతి అభిప్రాయమూ సార్వజనీనమైనది కాకపోవచ్చు. కానీ.. ఆ దృష్టిలో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉన్నదే అయిఉంటుంది.

ఆదర్శిని వెబ్ సైట్ లో వ్యాసకర్తలు/ రచయితలు/ కాలమిస్టులు వెలువరించే అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతం. ఆ అభిప్రాయాలను ఆదర్శిని వెబ్‌సైట్ భావజాలంగా పరిగణించడానికి వీల్లేదు. 

వర్తమానంలో.. మీడియా సంస్థలు పార్టీలకు కులాలకు ముడిపడి వార్తలను చూసే  దృష్టిని సంకుచితం చేసేశాయి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా.. సమకాలీన విషయాల మీద సీనియర్ పాత్రికేయుల దృక్కోణానికి ‘ఏది అనిపిస్తే’ అది.. స్వచ్ఛంగా నిజాయితీగా పాఠకులకు తెలియజెప్పడం మా లక్ష్యం.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు adarsini.com తన వంతు ప్రయత్నిస్తుంది. ఆదర్శిని వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. 

ఎవరైనా వ్యాసాలను.. editor.adarsini@gmail.com చిరునామాకు పంపవచ్చు. తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

నిష్పాక్షికంగా ఉన్నంత వరకు.. అలాంటి విశ్లేషణలను కోరుకునే పాఠకలోకానికి చేరువ కాగలం అనేది నమ్మకం. ప్రోత్సహించండి. ఈ వెబ్‌సైట్ లోని వార్తలు, కథనాలు మీకు నచ్చితే.. వార్త లింక్ ను మీ పరిచయస్తులకు కూడా ఫార్వర్డ్ చేయండి. తెలియజెప్పండి. సోషల్ మీడియా ద్వారా వార్తాకథనాలు పదిమందికీ తెలిసేందుకు సహకరించండి.

.. ఎడిటర్

error: adarsini.com Content is protected !!