పబ్జీ సరికొత్త వెర్షన్.. ఇండియాలో మళ్లీ రిజిస్టర్ అయింది.
మోడీజీ పబ్జీని భారతదేశంలో నిషేధించాక, ఈసారి ఇక్కడికి ఒక కొత్త గేమ్ తయారు చేసి, మళ్లీ వచ్చేయడానికి పబ్జీ పూర్తిగా రెడీగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆటలలో ఇది మొదటి స్థానంలో ఉంది. మరి ఉండదా?? దీన్ని ఆడే ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులూ వేరే ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక మళ్లీ మన 90 శాతం యువత ఫోన్‌లు పట్టుకుని ఆత్రుతగా ఎదురుచూస్తూ కూర్చోబోతున్నారేమో
తాజా నివేదికలను నమ్మేటట్టయితే, పబ్జీ రిలీజ్ అయ్యాక ఉండబోతున్న పబ్జి టోర్నమెంటు మొదటి బహుమతిగా దాదాపు 6 కోట్లు ఇవ్వనున్నారట.! ఉద్యోగం ఎవరికైతే రాబోతోందో, వాళ్లకి జీతం రూ.40,000 నుంచి 2 లక్షల వరకు ఉండచ్చు అని తెలుస్తోంది. ఇవి కాకుండా, ‘స్పెషల్ ప్రైజ్‌లు’ కూడా ఉండచ్చు. ఉదాహరణకు, అందరికన్నా ఎక్కువ ‘ఫుట్ ట్రావెల్ డిస్టెన్స్’ ఉన్న వాళ్లకు, అందరికన్నా ఎక్కువ ‘హెడ్ షాట్స్’ ఉన్న వాళ్లకు ఇలాంటి బహుమానాలు రావచ్చు.
ఈ బహుమానాల గురించి మంగళవారం ఉండబోతున్న ప్రెస్ మీట్‌లో వివరంగా చెప్పబోతున్నారు అని ‘ఈ-స్పోర్ట్స్’ ప్లేయర్ అయిన అభిజీత్ అంధారే ట్వీట్ చేశాడు. కొత్త పబ్జీ ఇండియాలో మళ్లీ అధికారికంగా రిజిస్టరు అయిందని కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఈ-స్పోర్ట్స్ ఒక సరికొత్త తరాన్ని తీసుకువస్తాయి, ప్రతి ఒక్కరూ దీనిలో తమ ప్రతిభను కనిపెట్టవచ్చు, అని కూడా అభిజీత్ అదే ట్వీట్‌లో తెలిపాడు.
మరో పక్క పబ్జీ ఇండియాను ఆండ్రాయిడ్ ఇంక ఐ.ఓ.ఎస్ ఫోన్‌లలో వేసుకోవడానికి ప్రీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. కొద్ది రోజుల ముందు, ఈ గేమ్‌కు సంబంధించి ఒక ట్రెయలర్ విడుదల అయింది. కానీ, చాలా రకాల కాస్ట్యూమ్స్, స్కిన్స్, ఉన్న ఆ ట్రెయిలర్ ఫేక్ అని తర్వాత తెలిసింది. ఇది మాత్రమే కాకుండా, అభిమానులు గేమ్ ఫేక్ విడుదల గురించి కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు.
భారత యువత, ఊపిరి పీల్చుకోండి. పబ్జీ తిరిగి రాబోతోంది.
PUBG MOBILE INDIA GETS OFFICIALLY REGISTERED ✌?❤️ pic.twitter.com/LOOmZQMHZs
— Abhijeet Andhare (@TSMentGHATAK) November 23, 2020
.

Discussion about this post