గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కూల్చివేతలే హాట్ టాపిక్ గా మారుతున్నాయి .హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న పీవీ, ఎన్టీఆర్ ల సమాధులు కూల్చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ అంటే.. అందుకు అన్ని పార్టీల నాయకులూ ఘాటుగా స్పందిస్తున్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ కేవలం వారి మాటలను ఖండించారు. ఆ ఇధ్దరూ తెలుగుజాతికి గర్వకారణాలని అన్నారు. అయితే బండి సంజయ్ మాత్రం.. వారు తమ పార్టీ నాయకులు కాకపోయినప్పటికీ చాలా ఘాటుగా స్పందించారు. మజ్లిస్ ను ఘాటుగా తగులుకోడానికి ఇంతకు మించి ఛాన్సు రాదనుకున్నారేమో గానీ.. వారి సమాధులు కూలుస్తానంటే.. మీ దారుస్సలాంను కూడా కూలుస్తామంటూ హెచ్చరించారు.
మధ్యలో కాంగ్రెస్ తరఫున వీహెచ్ కూడా స్పందించడమే తమాషా. ఒకరు పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూలుస్తానంటే మరొకరు.. దారుస్సలాం కూలుస్తానంటారు. ఇదంతా చిన్న పిల్లల ఆటలాగా ఉన్నదంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అయినా నేతలు నిర్మాణాత్మకమైన హామీలతో ప్రజల వద్దకు వెళ్లాలి గానీ.. మంగళవారం నాటి ప్రచారాల హాట్ టాపిక్ సర్జికల్ స్ట్రైక్స్ అయితే.. బుధవారం నాటి ప్రచారాల హాట్ టాపిక్ సమాధుల కూల్చివేత లాగా కనిపిస్తోంది.
.

Discussion about this post