మరో రెండు రోజుల తర్వాత జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్రం అంతటా ఆసక్తి నెలకొని వుంది. ఇప్పటికే దుబ్బాక చేజారిపోవడంతో తెరాస పార్టీ గ్రేటర్ పీటం మళ్లీ కైవసం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అయితే అటు దుబ్బాక విజయాన్ని చేజిక్కించుకున్న బిజెపి పార్టీ కూడా ఇంతకన్నా పకడ్బందీగా వ్యూహాన్ని రచించుకుని, తదనుగుణంగా పావులు కదుపుతోంది. దీంతో గ్రేటర్ పీఠం ఏ పార్టీకి కైవసం కానుందో అని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ మునిపల్ ఎన్నికల్లో బిజెపి పీఠాన్ని అధిష్టించనుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే కాస్త పట్టు సంపాదించుకున్న బిజెపి త్వరలోనే గ్రేటర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటుందని ఆ పారీకి చెందిన సీనియర్ నేత గరికపాటి మోహనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు గ్రేటర్ ఎన్నికలపై నిర్వహించిన సర్వేల ఫలితాలన్నీ కూడా బిజెపికి అనుకూలంగానే వచ్చాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వరదలకు సంబంధించిన నష్టాన్ని గురించి తెరాస పార్టీ సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ప్రకటించిన మానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని, తెరాస మోసపూరిత పాలన గురించి ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అలాగే గ్రేటర్ ప్రజలు కూడా మార్పను కోరుకుంటున్నారని ఆయనఅన్నారు.
మొత్తంగా చూస్తే… గ్రేటర్ ఎన్నికలు ఇటు బిజెపికి తమ పట్టు మరింత గట్టిపరచుకోవడానికి అవసరమైతే.. అటు తెరాసకు పరువుకు సంబంధించిన విషయం అయిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబెడతారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచివుండక తప్పదుమరి…!
.

Discussion about this post