తోకపాయె కత్తి వచ్చె టాంటాంటాం.. అని చిన్నతనంలో మనం అందరమూ కూడా పాలు పాడుకునే ఉంటాం. సరదాగా ఆటలు ఆడుకునే ఉంటాం. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఇంచుమించుగా అలాంటిదే జరిగింది. ఇక్కడ కంకి పాయె.. సుత్తి వచ్చె టాంటాంటాం అని పాడుకోవాల్సి వస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి వామపక్ష పార్టీలు కూడా బరిలోకి దిగాయి. ఓల్డ్ మలక్‌పేటలో సీపీఐ అభ్యర్థి పోటీలో ఉన్నారు. వారి పార్టీ గుర్తు కంకి కొడవలి. అయితే.. బ్యాలెట్ పేపర్లో పొరబాటుగా సుత్తి కొడవలి ప్రింట్ అయింది.
మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైన కొద్ది సేపటికే ఈ పొరబాటును గుర్తించారు. దానిని బట్టి సీపీఐ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. ఓల్డ్ మలక్‌పేట పోలింగ్ రద్దు చేశారు. తర్వాత ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల అధికారులు ప్రకటించలేదు. కేవలం అధికారుల పొరబాటు కారణంగా.. ఒకచోట ఎన్నిక వాయిదా పడినట్లయింది.
.

Discussion about this post