కరోనా మహమ్మారి కారణంగా అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. ఇక గుడులు, చర్చ్ లు, మసీదులు వంటి పలు ప్రార్ధనాస్థలాలు విషయం చెప్పాల్సిన పనిలేదు. చాలావరకు దేవాలయాలు, ప్రార్ధనాలయాలు అన్నీ కూడా కేవలం పూజారుల వరకే పరిమితమయ్యాయి. భక్తులకు దూరంగా వుండిపోయాయి. ఈ నేపధ్యంలో కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించిన నేపధ్యంలో అన్ని దేవాలయాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా లోని లింగరాజ దేవాలయం కూడా తెరచుకుంది. పదకొండవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ దేవాలయం ఎంతో ప్రశస్థి కలిగినది.
![]()
కరోనా కారణంగా ఈ పుణ్యక్షేత్రం గత తొమ్మిది నెలలుగా మూసివుంది. కాగా తాజాగా కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ దేవాలయాలను తెరవ వచ్చని ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తొమ్మిది నెలల అనంతరం లింగరాజ దేవాలయం తెరచుకోనుంది. ఇప్పటి వరకు కేవలం అర్చకులు, సేవకులు, వారి కుటుంబ సభ్యులను మాత్రమే దేవాలయం లోకి అనుమతించేవారు.
తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జనవరి 3వ తేదీ నుండి ఈ దేవాలయాన్ని భక్తుల దర్శనానికి కూడా వీలు కల్పించనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనానికి వీలు కల్పించనున్నారు. ఈ నేపధ్యంలో లింగరాజ స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు మాత్రం కచ్చితంగా కరోనా నెగిటివ్ రిపోర్టును చేతిలో పెట్టుకుని మరీ దేవాలయానికి వెళ్లాల్సివుంటుంది.
ఇందుకోసం భక్తులకు కరోనా పరీక్షల నిర్వహణ తదితర సౌకర్యాల కోసం ఆలయ అధికారులు ఆలయ సమపంలోనే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దర్శనానికి వెళ్లదలచుకున్న భక్తులు ముందుగా కరోనా పరీక్ష చేయించుకుని, నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే స్వామి దర్శనానికి వెళ్లవలసి వుంటుంది.
.

Discussion about this post