బాబాలు, స్వాములు మన దగ్గర మాత్రమే కాదు. ప్రతి చోటా ఉంటారు. వీరిలో కేవలం మత, ధర్మ ప్రచారం చేసే వారు మాత్రమే కాకుండా, భవిష్యద్దర్శనం చేసేవాళ్లు కూడా చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో బల్గేరియాలో ఉండే బాబా వంగా కూడా ఒకరు. నోస్ట్రడామస్ లాగా భవిష్యత్ పరిణామాలను ఊహించి చెప్పడంలో.. బల్గేరియాలో ఈ బాబా వంగాకు చాలా గొప్ప పేరు ప్రతిష్టలే ఉన్నాయి. ఆమె జన్మతః అంధురాలు. ఆమె అసలు పేరు వంగెలియా పండేవా గుష్తెరోవా (డిమిత్రోవా). ఆమె మరణించి ఇప్పటికి అయిదేళ్లయింది. కానీ మన బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా ఆమె చెప్పిన భవిష్య అంచనాలకు ఇప్పటికీ మన్నన ఉంది.
తాజాగా ఆమె చెప్పిన సంగతులుగా ప్రచారంలోకి వస్తున్నవి మాత్రం యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసేవి.
2021 సంవత్సరంలో మరింత భయానకంగా ఉండబోతుందని బాబా వంగా చెప్పారట. ఆమె చెప్పిన వాటిలో డయానా మరణం, ఫుతిన్ పై హత్యాయత్నం వంటివి అనేకం ఖచ్చితంగా జరిగాయట. స్వయంగా రాయడం తెలీని వంగా చెప్పినవి ఇతరులు రాసి పెట్టారు. అయితే అవి నిజమో కాదో తెలియదు గానీ.. ఆమె చెప్పిన జోస్యంగా.. 2021 భయానక పరిస్థితి గురించి అంచనాలు వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నోస్ట్రడామస్ కూడా 2021 గురించి ఇలాంటి వివరాలే చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొవిడ్ కొత్త వేరియంట్లేనా?
2020 సంవత్సరం మొత్తం కొవిడ్ దెబ్బకు హరించుకుపోయింది. వాక్సిన్ వస్తోందని ఆనందిస్తున్న వేళ.. కొత్త వేరియంట్ కొవిడ్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు బాబా వంగా చెప్పిన జోస్యం నిజమే అయ్యేట్లయితే.. కొవిడ్ మరిన్ని వేరియంట్ ల రూపంలో 2021ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. కొవిడ్ కనుగొన్న తొలిరోజుల్లోనే.. ఇది ముందు ముందు రూపు మార్చుకునే ప్రమాదం కూడా ఉన్నదని పలువురు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే.. ఇప్పుడు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇదే మాదిరిగా.. 2021 సంవత్సరం కూడా మహమ్మారి దెబ్బకు ఆవిరైపోయే ప్రమాదం ఉందని పలువురు భయపడుతున్నారు.
.

Discussion about this post