పెద్దపల్లి వద్ద అడ్వకేట్ వామన్ రావు దంపతులు అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. వీరిని హత్యచేసిన కత్తులు ఏమయ్యాయి. వాటిని కూడా కోర్టు ముందు పెట్టడానికి పోలీసులు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. ఒక నేరం జరిగితే.. నిందితులతో పాటు.. ఎగ్జిబిట్స్ ను కూడా పెట్టడం తప్పదు. కానీ వామన్ రావు దంపతుల్ని చంపిన వారు.. కత్తుల్ని సుందిళ్ల బ్యారేజ్ లో పడేయడంతో.. అవి దొరకలేదు. వాటిని వెతికి పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.
సోమవారం మరోసారి సుందిళ్ళ బ్యారేజ్ లో కత్తుల కోసం గాలింపు చేపట్టడానికి పోలీసులు సన్నాహాలు చేశారు. వామన్ రావు దంపతుల హత్య తరువాత కత్తులను బ్యారేజ్ లో పడవేసినట్లు నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి స్వయంగా పోలీసులకు తెలిపారు. కత్తుల స్వాధీనం చేసుకోవడం కోసం వైజాగ్ నుంచి గజ ఈతగాళ్ళ బృందాన్ని రప్పించారు. 54నుంచి 60 వ గేట్ వద్ద కత్తులు పడవేసినట్లు నిందితులు చూపించారు. పోలీసులు ఆదివారం ఆ ప్రాంతంలో బ్యారేజ్ లో వెతికించారు గానీ దొరకలేదు. సోమవారం కత్తుల్ని వెతకడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు.
బ్యారేజ్ అడుగు భాగాన బురద ఉండడంతో అందులో కత్తులు కూరుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కత్తులు దొరకపోతే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని కోర్ట్ ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే.. ఈ కేసులో నిందితులు తొలుతే దొరికిపోయినప్పటికీ.. పోలీసులు మితిమీరిన జాప్యం చేస్తూ నీరుగారుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
.

Discussion about this post