కెసీఆర్ ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకుపోయే నాయకుడో అందరికీ తెలుసు. ఆయన తనయగా, తెలంగాణకోసం మహిళాలోకాన్ని ఉత్తేజపరుస్తూ పోరాడిన నాయకురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత కూడా ఏం తక్కువ కాదు. తాను కూడా అంతే స్థాయిలో ప్రజలతో మమేకం అయిపోతానని ఆమె నిరూపించుకున్నారు.

సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత జన్నేపల్లి పర్యటనకు వెళ్లారు. అనంతరం, తిరిగి హైదరాబాదు వస్తుండగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి హైవే పై టేక్రియాల్ వద్ద ఓ దాబా వద్ద కారు ఆపించారు. ఆ దాబాకు వెళ్లి కాఫీ తాగి, దాబా నిర్వాహకులు, స్థానికులతో కాసేపు ముచ్చటించారు.
దాబా నిర్వాహకులతోను, దాబాలో కాఫీ సర్వ్ చేసే కుర్రాడితోనూ ఫోటోలు దిగారు. అనంతరం తిరిగి హైదరాబాదు బయల్దేరారు.

.
Discussion about this post