శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని వెళ్తున్న భక్తులు ఘోరరోడ్డుప్రమాదానికి గురై కడతేరిన దుర్ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలంనుంచి తిరిగి వెళ్తున్న టెంపో, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఐదుగురు మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు. మిగిలిన వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

.

Discussion about this post