అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. తిరు వేంకట గిరినాధుడు.. వేంకటేశ్వరుడు.. 2021 సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు.. వాహనసేవల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క అంతరార్థం ఉంటుంది. రాజమన్నార్ అలంకారంలో మలయప్ప స్వామివారు.. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు.
క్పలవృక్ష వాహనంలోని అంతరార్థం.. అందులోని ఆధ్యాత్మిక చింతన తెలుసుకోవాలనుకుంటున్నారా..

శ్రీనివాసుని కల్పవృక్ష వాహనం :
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి శ్రీవారు నాలుగో రోజు ఉదయం భక్తులకు దర్శనమిస్తారు.
కల్పవృక్ష తత్వానికే అధిదేవుడిగా.. తిరు వేంకటేశ్వరుడు.. కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడనే అంతరార్థం ఈ వాహన సేవలో ఉంటుంది.
వైభవంగా వాహనసేవ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.
వాహనసేవలో ప్రముఖులు
వాహనసేవలలో పెద్దజీయర్, చిన్నజీయర్, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, సనత్ కుమార్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post