అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటాద్రీశుని సన్నిధిలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రులు అందరూ తిరుపతి వస్తున్న సందర్భంగా.. వారికి సంబంధించిన ఏర్పాట్లతో నే తిరుమలలో రద్దీ ఎక్కువ అవుతుంది కనుక, ఇతర విఐపిలను వద్దని టిటిడి హెచ్చరిస్తోంది. ఈ మేరకు నవంబరు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని ప్రకటన విడుదల చేశారు.
తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
ఈ కారణంగా నవంబరు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా, నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
.

Discussion about this post