చిత్తూరు జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా బాధితులకు అండగా నిలుస్తున్నారు. స్వయంగా వరదతాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
భారీ వర్షాలకు ఇళ్ళు కోల్పోయిన విజయపురం మండలం మహారాజపురం ST కాలనీ కు చెందిన వారికి, చుట్టుపక్కల వారు3 మొత్తం తక్షణ భృతి కై మొత్తం 60 మంది బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి తన వంతు సాయంగా బియ్యం, కూరగాయలు, నూనె మొదలైన అత్యవసర వస్తువులను తక్షణ సహాయం కింద అందించి ఆదుకున్నారు.
వీరు ఈ మధ్య ఇక్కడకు వచ్చి స్థిరపడిన కారణం గా వాళ్లకు రేషన్ కార్డు, మరియు గుర్తింపు కార్డులు లేనందున వాటిని ఇప్పించి శాశ్వత గృహ కల్పన కు చర్యలు తీసుకుంటానని ఎమ్మేల్యే ఆర్కే రోజా హామీ ఇచ్చారు.
.