తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఈ నెల 31వ తేదీ శుక్రవారం తంబళ్లపల్లె మండలంలోని బాలిరెడ్ఢిగారిపల్లె, కోసువారినపల్లె పంచాయతీల్లో పర్యటించనున్నట్లు వైసీపీ మండల కన్వీనరు రేపన చౌడేశ్వర తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పల్లెబాటకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు.
బాలిరెడ్డిగారిపల్లె పంచాయతీలో ఉదయం 7గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
పల్లెబాటలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
.

Discussion about this post