రాష్ట్రోపాధ్యాయ సంఘం నూతన క్యాలెండరును శుక్రవారం తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి పాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.
బడులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ‘నాడు-నేడు’ పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు ఉపాధ్యాయులు కూడా సహకరించాలని కోరారు. ఇక రాష్ట్రోపాధ్యాయ సంఘం పాధ్యాయులు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు.
ఈ సంఘానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి తంబళ్లపల్లె మండలానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ నారాయణ రెడ్డి , వైస్ ఎంపీపీ పి.కోటిరెడ్డి , మండల విద్యా శాఖాధికారి త్యాగరాజు, ఎంపీడీవో దివాకర్ రెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ నరేంద్ర రెడ్డి , సింగిల్ విండో చైర్మన్ భార్గవ్ రెడ్డి , మాజీ ఎంపీపీ వెంకటరమణా రెడ్డి, బాల్ రెడ్డి గారి పల్లి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి ఇతర సర్పంచులతో పాటు ఎస్టీయూ జిల్లా నాయకులు రెడ్డప్ప రెడ్డి, మొగిలీశ్వరయ్య, సాంబశివ, నరసింహారెడ్డి, ఎస్టీయూ మండల గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు, అధ్యక్షులు కృష్ణప్ప, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, ఆర్థిక కార్యదర్శి రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు యహసానుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.

Discussion about this post