చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా అరుదుగా.. పెద్దిరెడ్డి ఆధిపత్యం మీద రోజా ధిక్కార స్వరం వినిపించినప్పుడు మినహా చిత్తూరు జిల్లా పార్టీ రాజకీయాలు ఇతర ప్రాంతాల్లో చర్చకు రావడం జరగదు. జిల్లాలో ఆ పార్టీ మీద పెద్దిరెడ్డి గుత్తాధిపత్యం అలాంటిది. అయితే ప్రస్తుతం.. పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డిపై ఆరోపణలు చేసి, ఆ వెంటనే అరెస్టు అయిన సొంత పార్టీ నాయకుడి వ్యవహారం రచ్చకెక్కింది. పార్టీలోనే కాదు, బయటివారు కూడా అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇదే వ్యవహారంపై తనదైన శైలిలో ఎంపీ మిధున్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా ఉంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిధున్ రెడ్డి.. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత కొండ్రెడ్డిపై చాలా కేసులు ఉన్నాయని అన్నారు.
కొండ్రెడ్డి అనే సదరు నాయకుడు.. అక్కడి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డిమీద ఆరోపణలు చేసి వివాదాస్పదం అయ్యారు. ఆయన తంబళ్లపల్లె జడ్పీటీసీ వైసీపీకి చెందిన గీతారెడ్డికి భర్త. ఎమ్మెల్యే నియోజకవర్గంలో మహిళా నాయకుల్ని వేధిస్తున్నారని, ఆయననుంచి హాని పొంచిఉన్నందువలన తాను అజ్ఞాతంలో ఉన్నానని అన్నారు. ఈ వివాదం రేగిన రెండురోజుల్లోనే కొండ్రెడ్డిని చాలా ఏళ్ల కిందటి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన మీద ఇంకా చాలా చాలా కేసులు ఉన్నాయని, బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా ఉన్నాయని మిధున్ రెడ్డి.. సదరు కొండ్రెడ్డి యొక్క నేరచరిత్ర గురించి ఇంకా బాగా తెలియజేశారు.
అంతా బాగానే ఉంది. మరి అన్ని కేసులు ఉన్న వ్యక్తి భార్యను జడ్పీటీసీ ని చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్టు? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కేసుల సంగతి ఏమీ తెలియకుండానే.. పార్టీ టికెట్టు ఇచ్చారా? మోసం కేసులు లాంటివి ఉన్నా సరే.. రాజకీయ నాయకుల మీద అలాంటి కేసులు సాధారణమే అనుకోవచ్చు. కానీ బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా ఉన్న వ్యక్తి భార్యకు జడ్పీటీసీ టికెట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
జడ్పీటీసీ టికెట్లు ఇచ్చే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరీ అంత గుడ్డిగా వ్యవహరించిందా? లేదా, దోపిడీదొంగ, మోసగాడు అయితే మాత్రం ఏమిటి.. డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవగల సత్తా ఉన్న వ్యక్తి అయితే చాలునని సర్దుకుపోయిందా? అనేది ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం. పార్టీ టికెట్ కోసం ప్రయత్నించేవాళ్ల చరిత్ర తెలుసుకోకుండానే టికెట్లు ఇచ్చేశాం అని చెప్పినా సరే.. అది కూడా పార్టీకి పరువు నష్టం. ఎందుకంటే.. అక్కడ, అంటే తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే స్వయంగా మిధున్ రెడ్డికి బాబాయే. అప్పట్లో చూసుకోలేదు.. అని మిధున్ రెడ్డి అంటే.. అది బాబాయి వైఫల్యం కిందికి వస్తుంది. అప్పట్లో కొండ్రెడ్డి నేరచరిత్ర తెలిసి కూడా టికెట్ ఇచ్చాం అని ఒప్పుకుంటే.. అది పార్టీ పరువును ఇంకా ఘోరంగా గంగలో కలిపేస్తుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అంటే.. దాని అర్థం మీ కుటుంబానికి మద్దతుగా ఉంటూ, మీ కుటుంబం ప్రాపకంలో ఉన్నంత కాలం నేరగాళ్లు అయినా సరే.. పార్టీ పదవులతో అందలాలు ఎక్కిస్తారు. మీమీద విమర్శలు చేస్తే.. కేసులన్నీ బయటకు తీసి అరెస్టులు చేయిస్తారా? అని అర్థం వస్తుంది. రెండు రకాలుగానూ.. ఏ రకంగా మిధున్ రెడ్డి మాటలను సమర్థించుకున్నా పరువు పోతుంది. అచ్చంగా మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా తయారైంది.
.

Discussion about this post