దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తుండడంతో బాధితులను గుర్తించడానికి ఇంటింటా సర్వే చేప్టారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని కొవిడ్ ఇన్ ఛార్జి డాక్టర్ చంద్రమోహన్ ఈ విషయాలను గురించి వివరించారు.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం నాటికి 175 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కొవిడ్ ఇన్ ఛార్జి డాక్టర్ చంద్రమోహన్ చెప్పారు. కొవిడ్ ఉధృతి పెరుగుతుండటంతో వైద్య సిబ్బంది శ్రీకాళహస్తిలో ఇంటింటా ఫీవర్ సర్వేకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం తాజాగా 32 మందికి కొవిడ్ సోకిందన్నారు. వీటితో కలిపి 175 యాక్టివ్ కేసులు పట్టణంలో ఉన్నాయన్నారు.
వీటికి సంబంధించి 522 ప్రైమరీ, 768 సెకండకీ కాంటాక్టులు గుర్తించినట్లు చంద్రమోహన్ చెప్పారు. కొవిడ్ బాధితులను గుర్తించడానికి ఇంటింటా సర్వే చేస్తేన్నట్లు చెప్పారు.
వ్యాధి సోకొనట్లు ఏమాత్రం తెలిసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోకుండా ఉండడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిజ, డాక్టర్ శాంతి, ఏఎన్ఎం రాధిక, వలంటీర్లు పాల్గొన్నారు.
.

Discussion about this post